📅 నాలుగు రోజులు క్రిష్ణా జిల్లాలోనే ఉండబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్. 🚗 ఇవాళ బహిరంగసభ తర్వాత మచిలీపట్నం చేరుకుంటారు. 🌟
రెండురోజులు బందరులోనే ఉంటూ పార్టీనేతలతో సమావేశాలు, జనవాణి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 🤝 4న పెడన, ఐదున కైకలూరులో వారాహి యాత్ర కొనసాగుతుంది. 🤝 పవన్ వారాహి యాత్రకు సంఘీభావం ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. సంపూర్ణ మద్దతు నిస్తున్నామని, తమ పార్టీ శ్రేణులు పూర్తిగా సహకరిస్తారని.. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత చెప్పారు బాలక్రిష్ణ. రెండు పార్టీల నుంచి చెరో ఐదుగురు సభ్యులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 🤝 అటు… తెలుగుదేశం పార్టీ మద్దతునివ్వడంతో వారాహి యాత్ర నాలుగో విడతలో జనం గతం కంటే ఎక్కువమంది వచ్చినట్టు జనసేన వర్గాలు చెప్పుకుంటున్నాయి. 👏 ఇదే వారాహి యాత్రలో జరిగే మిగతా సభల్లో పవన్ మరింత దూకుడు పెంచి.. ప్రభుత్వంపై ఆరోపణలు సంధించే అవకాశముంది. 📢