🇮🇱 ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ద పరిస్థితులను దేశ ప్రధాని నరేంద్ర మోదీ 🕵️♂️🔍🌍 ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అక్కడి సమాచారాన్ని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హమాస్ మిలిటెంట్లు సృష్టిస్తున్న విధ్వంసంతో ఇజ్రాయిల్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ దేశ ప్రధాని నుంచి ఫోన్ కాల్ ద్వారా అడిగి తెలుసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 📱📢🌐
అలాగే ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేసి తెలియజేశారని ఆయన చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులందరూ ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశం ఏ విధమైన ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని ప్రధాని అన్నారు. ఇజ్రాయెల్‌పై జరిగిన ఈ దాడిని ఆయన ఖండిస్తున్నారు. 🤝🇮🇳🇮🇱💪