top of page

ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది కానీ..?🎥✨

ఇటీవల తెలుగు నాట చిన్న సినిమాగా రిలీజై సంచలనం సృష్టించిన చిత్రం ప్రేమలు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ తెలుగు ఆడియెన్స్ ను కూడా మెస్మరైజ్ చేసింది. తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేమలు సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. అందుకే తెలుగు సినిమాలను మించి కలెక్షన్లను సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచిందీ యూత్ లవ్ స్టోరీ.. గిరీష్ ఏడీ తెరకెక్కించిన ప్రేమలు సినిమాలో స్లీన్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాతో మమితా బైజు ఒక్కసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇలా ఎన్నో విశేషాలతో కూడిన ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ఏప్రిల్ 12 నుంచి ప్రేమలు సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళం వెర్షన్ కు సంబంధించి మాత్రమే క్లారిటీ ఇచ్చారు. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇక ప్రేమలు తెలుగు వెర్షన్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 12 నుంచే తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తుందని టాక్. అయితే దీనిపై ఇంకా ఆహా ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.🎥✨

bottom of page