top of page
MediaFx

'ప్రసన్న వదనం' సినిమా రివ్యూ


సుహాస్ నటించిన లేటేస్ట్ సినిమా ప్రసన్న వదనం. ఈ చిత్రానికి అర్జున్ వైకే దర్శక్తవం వహించగా.. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్స్ పై మణికంఠ జెఎస్, ప్రసాద్ రెడ్డి టీఆర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికీ ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై క్యూరియాసిటీని కలిగించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా మే 3న అడియన్స్ ముందుకు వచ్చింది.మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో  తెలుసుకుందాం !

ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో సాగిన ఈ ‘ప్రసన్నవదనం’ సినిమాలో కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. హీరోగా సుహాస్ సూర్య పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ఈ సినిమా కొన్నిచోట్ల బాగానే ఆకట్టుకుంది. సుహాస్ కూడా తన యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధ పడే సూర్య పాత్రలో సుహాస్ చాలా బాగా ఒదిగిపోయాడు.

ఇక హీరోయిన్ గా నటించిన పాయల్ రాధాకృష్ణ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన రాశీ సింగ్ తన నటనతో మెప్పించింది. ఆమె పాత్ర కూడా బాగుంది. మరో కీలక పాత్రలో నందు చాలా బాగా నటించాడు. అలాగే నితిన్ ప్రసన్న, , హర్ష వర్ధన్,వైవా హర్ష, సాయి శ్వేత చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాలో విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.

దర్శకుడు అర్జున్ వై.కె ఫేస్ బ్లైండ్ నెస్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. హీరో- హీరోయిన్ మధ్య సాగే సీన్స్ కూడా బాగా స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేదు. ఇక హీరో పాత్ర కూడా సాయం చేయడానికే ఉంది అన్నట్టు చాలా సీన్స్ లో ఆ ట్రాక్ నే ఇరికించారు.

దీనికితోడు అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా సినిమా ఈ స్లో నేరేషన్ తో సాగింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు.

ప్రసన్నవదనం అంటూ వచ్చిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కానీ, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా సాగడం, సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే సింపుల్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.


bottom of page