top of page
Suresh D

మధ్య తరగతి ప్రజల కోసం మోదీ కొత్త పథకం- ఇక ఆ ఖర్చులు తగ్గుతాయి!

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన అనంతరం.. దేశ ప్రజలకు మరో తీపి కబురు అందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన అనంతరం.. దేశ ప్రజలకు మరో తీపి కబురు అందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. రూఫ్ టాప్ సోలార్ ఇన్​స్టాలేషన్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

ఈ పథకం కింద 10 మిలియన్ల కుటుంబాలకు రూఫ్​ టాప్ సోలార్ ఇన్​స్టాలేషన్లు లభిస్తాయని మోదీ అన్నారు.

Pradhan Mantri Suryodaya Yojana details : భారతీయుల ఇళ్లపై వారి సొంత సోలార్​ రూఫ్​ టాప్​ సిస్టెమ్​ ఉండాలన్న నా సంకల్పం.. ఈరోజు అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మరింత బలపడింది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్​ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది," అని మోదీ అన్నారు.

“పేద, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లులను తగ్గించడానికి ఈ పథకం సహాయపడుతుందని ప్రధాని మోడీ అన్నారు. దీనికి తోడు గా.. మధ్యతరగతి కూడా ఇంధన రంగంలో భారత్ ను స్వయం సమృద్ధి సాధించేలా చేస్తుంది,” అని మోదీ పేర్కొన్నారు.

Pradhan Mantri Suryodaya Yojana scheme : కొత్త పథకం విషయంలో.. నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ మంత్రిత్వ శాఖల అధికారులు మోదీ సోమవారం సమావేశమయ్యారు. రూఫ్ టాప్ సోలార్​ను పెద్ద సంఖ్యలో అవలంబించేలా రెసిడెన్షియల్ వినియోగదారుల కోసం జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాలని ఈ సమావేశంలో మోదీ.. అధికారులను ఆదేశించారు.

రూఫ్​ టాప్​ సోలార్​లు తక్కువే..

రూఫ్ టాప్ సోలార్ ఇన్​స్టాలేషన్స్ ఇంకా ఊపందుకోని సమయంలో ఈ పథకం రావడం గమనార్హం. 2022 చివరి నాటికి 40 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 5.87 గిగావాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులను మాత్రమే ఏర్పాటు చేశారని, ఇది ఆశించిన లక్ష్యంలో 15% కంటే తక్కువని.. గత ఏడాది మేలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ తెలిపింది.

Pradhan Mantri Suryodaya Yojana news : ప్రస్తుతం గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ సామర్థ్యం 72.31 గిగావాట్లలో 11.08 గిగావాట్లు ఉన్నట్లు కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఎనర్జీ ట్రాన్సీషన్​ ప్లాన్​ ప్రకారం.. 2030 నాటికి మొత్తం పునరుత్పాదక సామర్థ్యం 500 గిగావాట్లలో.. సౌర విద్యుత్ 292 గిగావాట్లు అవుతుందని భావిస్తున్నారు.

ఈ పరిణామంపై సోలార్ స్క్వేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రేయా మిశ్రా మాట్లాడుతూ.. “నేడు, భారతదేశంలో 1% కంటే తక్కువ ఇళ్లలో సోలార్ ఉంది, కానీ ఈ కథ మారబోతోంది. సోలార్​తో ”ఎనర్జీ ఇండిపెండెంట్​"గా మారడానికి వినియోగదారుల నుంచి ఆసక్తి ఉంది. హోమ్ సోలార్ అడాప్షన్​లో జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి అధునాతన రెసిడెన్షియల్ సోలార్ మార్కెట్ల సరసన భారత్ త్వరలో చేరుతుంది," అని అభిప్రాయపడ్డారు.

bottom of page