top of page
MediaFx

ప్రభుదేవ పాటకు భార్యతో కలిసి రాజమౌళి డాన్స్ సూపర్..


టాలీవుడ్ ఇండస్ట్రీలోని అపజయమెరుగని డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీతో యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి హాలీవుడ్ గడ్డపై నిలిపారు. ట్రిపుల్ ఆర్ మూవీతో హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించిన జక్కన్న.. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అటు మహేష్ సైతం ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇటీవలే వీరిద్దరి కలిసి దుబాయ్ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఓవైపు మహేష్ సినిమా కోసం పూర్తిగా టైమ్ కేటాయించిన జక్కన్న.. అటు ఫ్యామిలీతో కూడా సరదాగా గడుపుతున్నారు. వర్క్ పరంగా బిజీగా ఉన్నా.. కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇటీవల తమ ఫ్యామిలీ పెళ్లి వేడుకలో తన భార్య రామ రాజమౌళితో కలిసి జక్కన్న చేసిన డాన్స్ వీడియోస్ వైరలయ్యాయి. ప్రభుదేవ సూపర్ హిట్ “అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే” సూపర్ హిట్ పాటకు స్టేజ్ పై డాన్స్ వేసి అదరగొట్టారు. ఆ తర్వాత రిహార్సిల్ చేసిన వీడియోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి.

తాజాగా ఓ డాన్స్ మాస్టర్ మాస్టర్ రాజమౌళి, రామ డాన్స్ ఆకట్టుకుంది. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ దగ్గర పనిచేసే రాధాకృష్ణ మాస్టర్ ఈ జంటకు డాన్స్ నేర్పించారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జక్కన్న తనయుడు కార్తికేయ పెళ్లికి వాళ్లకి డాన్స్ నేర్పించడానికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తో కలిసి వెళ్లానని. డాన్స్ నేర్చుకోవడం కూడా రాజమౌళి చాలా డెడికేటెడ్ గా చేస్తారని.. పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ప్రాక్టీస్ చేస్తారని అన్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుక డాన్స్ కోసం తనను పిలిచారని.. నాలుగు పాటలు సెలక్ట్ చేసి వాటికి చాలా కష్టపడ్డారని అన్నారు. పొద్దున్నే ఆరింటికి వెళ్లి నేర్పించేవాడినని.. అవి లీక్ అవ్వుకూడదు కానీ అయ్యాయని.. అందులో ఒక్కసాంగ్ మాత్రమే లీక్ అయ్యిందని అన్నారు. ప్రస్తుతం డాన్స్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.


bottom of page