top of page
Suresh D

లండన్‌లో విలాసవంతమైన బంగ్లాలోకి ప్రభాస్‌.. నెలకు అద్దె ఎన్ని లక్షలో తెలుసా..?🎞️🎥

కాగా కల్కి సినిమా మే9 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే దీని తర్వాత కొంత కాలం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడట ప్రభాస్‌. సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చేసి కొద్ది రోజులు లండన్ లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడట.


బాహుబలి 2 తర్వాత వరుసగా ప్లాఫ్‌ లు ఎదుర్కొన్న ప్రభాస్ కు సలార్ రూపంలో మంచి సాలిడ్ హిట్ లభించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరోసారి ప్రభాస్ స్టామినాను ప్రూవ్ చేసింది. బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. సలార్ తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD, మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్‌, అలాగే సందీప్ వంగా స్పిరిట్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. కాగా కల్కి సినిమా మే9 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే దీని తర్వాత కొంత కాలం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడట ప్రభాస్‌. సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చేసి కొద్ది రోజులు లండన్ లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడట. ఇందుకోసం ఓ విలాసవంతమైన బంగ్లాను లీజుకు తీసుకుంటున్నాడట డార్లింగ్. ఇందుకోసం నెల అద్దె ఏకంగా రూ. 60 లక్షలు చెల్లించనున్నాడట. ఇది తెలిసి ఫ్యాన్స్ అందరూ ఆశ్యర్యపోతున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ అంటే ఆ మాత్రమైనా ఉండాలంటూ మరికొందరు అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలోనూ ఇలాగే ఇటలీలో కొన్నాళ్ల పాటు ఉన్నాడు ప్రభాస్. నెలకు సుమారు రూ. 40 లక్షల వరకు అద్దె చెల్లించాడు. ఇప్పుడు ఏకంగా రూ. 60 లక్షలు చెల్లించి ఇంటిని అద్దెకు తీసుకునేందుకు రెడీ అయ్యాడట ప్రభాస్‌.

కల్కి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చని తెలుస్తోంది. త్వరలోనే ప్రమోషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ తదితర స్టార్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి సినిమాను నిర్మిస్తోంది.🎞️🎥

Kommentare


bottom of page