top of page

కల్కి రిలీజ్‌పై క్రేజీ అప్డేట్.. ప్రభాస్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

తాజాగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమాను మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన ‘సలార్’ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘ఉగ్రం’ కథను రీసైకిల్ చేశారంటూ కామెంట్స్ వినిపించినా.. సలార్ సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. ‘సలార్’ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్ అభిమానులకు మరో స్వీట్ న్యూస్ ఇది. కల్కి 2898 AD  సినిమా గురించిన క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

‘సలార్’ సక్సెస్ తర్వాత ప్రభాస్ సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది సంక్రాంతికి ‘కల్కి 2898 AD’ సినిమా విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. తాజాగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమాను మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి నటీనటులు ప్రభాస్‌తో కలిసి ‘కల్కి 2898 AD’ చిత్రంలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా కల్కి నుంచి ప్రోమో విడుదల చేయనున్నారు. ఈ ప్రోమో విడుదలయ్యాక సినిమాపై మరింత హైప్ పెరగనుంది. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page