top of page

ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తొలగించాలి.. బాహుబలి నిర్మాత

ప్రభాస్ అమరేంద్ర బహుబాలి పాత్రలో ఉన్న మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీవకళ ఉట్టిపడేలా ఆ విగ్రహాన్ని తాయారు చేశారు. అలాగే ఇప్పుడు మరో చోట కూడా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంచలన విజయం సాధించింది. ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. అలాగే దాదాపు 1500 కోట్ల వరకు వసూల్ చేసింది. ప్రభాస్ అమరేంద్ర బాహుబలి. మహేంద్ర బాహుబలి అనే రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రభాస్ అమరేంద్ర బహుబాలి పాత్రలో ఉన్న మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీవకళ ఉట్టిపడేలా ఆ విగ్రహాన్ని తాయారు చేశారు. అలాగే ఇప్పుడు మరో చోట కూడా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు.

మైసూర్‌లోని ఓ మ్యూజియంలోనూ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తాయారు చేశారు. సేమ్ మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఎలాంటి విగ్రహం ఉందో అలాంటి విగ్రహాన్నే మైసూర్ లోనూ తాయారు చేశారు. దీని పై చిత్ర నిర్మాత శోభూ యార్లగడ్డ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ విగ్రహానికి అనుమతి లేదని.. తమ అనుమతితో ఈ విగ్రహం ఏర్పాటు చేయలేదు అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శోభు యార్లగడ్డ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ…’ ఇది అనుమతి తీసుకుని చేసిన పని కాదు. మాకు తెలియకుండా, మా దృష్టికి తీసుకురాకుండా విగ్రహాన్ని తాయారు చేశారు. అంతే కాకుండా దాన్ని మ్యూజియంలో పెట్టారు. వెంటనే విగ్రహాన్ని తొలగించేలా తగిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు శోభు యార్లగడ్డ.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page