top of page

ప్రభాస్‌కు భారీ మొత్తంలో అడ్వాన్స్‌ ఇచ్చిన టీ సిరీస్‌.. దర్శకుడు ఎవరో తెలుసా.? 🎥✨


బాహుబలితో స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా బజ్‌ పెరుగుతుంది. "సలార్"తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించిన "కల్కి" విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వంలో "ది రాజా సాబ్‌," "సలార్ పార్ట్ 2," సందీప్‌ వంగ దర్శకత్వంలో ఓ సినిమా నటిస్తున్న ప్రభాస్‌ మరో భారీ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్‌కి బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ భారీ మొత్తంలో అడ్వాన్స్‌ ఇచ్చినట్లు సమాచారం. టీ సిరీస్‌ గతంలో ప్రభాస్‌తో "ఆదిపురుష్" చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. "ఆదిపురుష్" బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, విడుదలకు ముందుగానే జరిగిన బిజినెస్‌తో టీ సిరీస్ లాభాలు గడించింది. ఈ సక్సెస్‌ తర్వాత టీ సిరీస్‌ మరోసారి ప్రభాస్‌తో చేతులు కలుపుతోంది.

‘వార్‌’ సినిమా దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ ఓ కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రభాస్‌ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల కారణంగా టీ సిరీస్‌ సినిమా పట్టాలెక్కడానికి కనీసం రెండేళ్లు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page