top of page

Salaar X Review: గూస్‌బంప్స్ ఇంటర్వెల్.. మరణ మాస్ క్లైమాక్స్.. బ్లడీ బ్లాక్ బస్టర్ 🌟🔥

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్-1కి ట్విట్టర్‌లో భారీ రెస్పాన్స్ వస్తుంది. అసలు సినిమాను మెంటల్ ఎక్కించేశాడంటూ ఫ్యాన్స్ 🤩👏

ఆహా ఎన్నాళ్లకెన్నాళ్లకు విన్నామయ్యా మళ్లీ! అవును ట్విట్టర్ ఓపెన్ చేసిన వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి థియేటర్లో నుంచి వస్తున్న విధానం చూసే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంతలా ట్విట్టర్‌లో 'సలార్' సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముందుగా ఊహించినట్లుగానే డార్లింగ్ ప్రభాస్‌కి ఇది మాస్ కమ్ బ్యాక్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు చూస్తుంటే అసలు ఇది థియేటరా లేక స్టేడియమా అనిపిస్తుందంటూ ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని.. జీవితంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఈయన పేరు మర్చిపోరంటూ కొంతమంది ఎమోషనల్ అయిపోతున్నారు. మరి సినిమా గురించి ట్విట్టర్‌లో బజ్ ఏ రేంజ్‌లో ఉందో ఓ లుక్కేద్దాం. భారీ అంచనాల మధ్య ఈరోజు సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అలానే తెలంగాణలో కూడా రాత్రి నుంచి షోలు పడుతున్నాయి. దీంతో సినిమా చూసినవాళ్లు ఎక్స్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. "ఆహా ఇది ఊచకోత కాదయ్యా.. రాచకోత. ఏం తీశాడు భయ్యా సినిమా. రాజమౌళిని బోయపాటిని మిక్సీలో వేసి తీసినట్లున్నాయ్ ఫైట్స్. అసలు సినిమాలో మూడు సీన్లు చాలు.. ఇది మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్. హిట్టు కొట్టేశాం. కేజీఎఫ్‌ను మించి ఉందయ్యా సినిమా" అంటూ థియేటర్‌లో నుంచి వస్తున్న ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 🎬👍😃"

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page