top of page

🎥 ఆ థియేటర్‌లో 'సలార్' కోసం 'డంకీ' తీసేశారు! 🎬

(Salaar) సినిమా థియేటర్ల కేటాయింపు విషయంలో నార్త్ ఇండియాలో ప్రభాస్‌కు అన్యాయం జరుగుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని మల్టీప్లెక్సులు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా 'డంకీ'కి (Dunki) ఎక్కువ థియేటర్లు ఇచ్చి 'సలార్' చాలా తక్కువ ఇచ్చాయని ఫ్యాన్స్ మండిపడ్డారు.

🤩🎥బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా విడుదలైంది అంటే దేశంలో ఏ థియేటర్‌లో విడుదల కాకపోయినా ముంబైలోని ఒక్క థియేటర్‌లో మాత్రం కచ్చితంగా విడుదల కావాల్సిందే. 🎦🇮🇳అదే ముంబైలోని అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్ మరాఠా మందిర్. షారుఖ్ ఖాన్ ఎవర్‌గ్రీన్ హిట్ మూవీ 'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే' గత 29 ఏళ్లుగా ఈ థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది. 🤯🎥ప్రతిరోజూ మార్నింగ్ షో ఈ సినిమా షో పడుతుంది. మిగిలిన మూడు ఆటలు కొత్త సినిమాలకు కేటాయిస్తారు. ఈనెల 21న విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా 'డంకీ' (Dunki) కూడా ఈ థియేటర్‌లో విడుదలైంది. మూడు ఆటలు 'డంకీ' వేశారు. 🎉🍿అయితే, నిన్న (డిసెంబర్ 22న) ప్రపంచ వ్యాప్తంగా 'సలార్' (Salaar) విడుదలైంది. ఈ సినిమాకు నార్త్ ఇండియాలో సరిగా థియేటర్లు కేటాయించలేదని ప్రభాస్ అభిమానులు నిరుత్సాహపడ్డారు. 🤩🙌దీనికి కారణం షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమా అని మండిపడ్డారు. ఐనాక్స్, పీవీఆర్, మిరాజ్ లాంటి మల్టీప్లెక్స్ చెయిన్స్ కూడా 'డంకీ' కోసం 'సలార్'కు ఎక్కువ షోలు కేటాయించలేదని వార్తలు వచ్చాయి. 🤨🍿నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ రంగంలోకి దిగడంతో వీళ్లంతా దారికొచ్చి 'డంకీ', 'సలార్'కు 50-50 కేటాయింపు చేశారని తెలిసింది. 🤝🎬ఇలాంటి పరిస్థితిలో షారుఖ్ ఖాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 🙏🎥మరోవైపు, 'సలార్'పై దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. 📢📰'దిల్‌వాలా దుల్హానియా లే జాయేంగే' సినిమాకు 40 టికెట్లు తెగితే.. 'సలార్'కు 15 టికెట్లే తెగాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 😮🎫ఇదిలా ఉంటే, నిన్న 'సలార్' సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మళ్లీ కళకళలాడాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. 🎆🎟️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page