top of page

🎬👊 ఊచకోత కాదు.. బాక్సాఫీస్‌ నరుకుడు.. సంచలనంగా సలార్ కలెక్షన్స్‌ 🎥💰

డార్లింగ్ ప్రభాస్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. ఇటీవలే విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ 10 రోజుల్లోనే రూ. 600 కోట్ల క్లబ్ లో చేరింది.

'సలార్' సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో పాన్ ఇండియాకి చూపిస్తున్నాడు. కాటేరమ్మ కొడుకు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. 'ఎ' సెంటర్స్ నుంచి 'సి' సెంటర్స్ వరకు, హిందీ మార్కెట్స్ నుంచి ఓవర్సీస్ వరకు ప్రభంజనం సృష్టిస్తున్నాడు. డార్లింగ్ మాస్ అవతారాన్ని చూపించిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ, రూ. 650 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. 'బాహుబలి' 'బాహుబలి 2' తర్వాత 600 కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రభాస్ హీరోగా KGF ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్'. డిసెంబర్ 22న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన 'డుంకీ' సినిమాతో క్లాష్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఫస్ట్ డే రూ. 178.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ పాన్ ఇండియా చిత్రం.. 6 రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత కూడా తన హవా కొనసాగిస్తూ 10 రోజుల్లోనే ప్రతిష్టాత్మక 600 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 625 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 🌟💰

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page