top of page

నైజాంకా నవాబ్.. సలార్ దెబ్బకు ఇంకా షేక్ అవుతున్న బాక్సాఫీస్🎥🌟

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదిరిపోయే కామ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు ఆరేళ్లుగా సరైన హిట్ లేక సతమతం అయిన ప్రభాస్ ఓకే ఒక్క సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదిరిపోయే కామ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు ఆరేళ్లుగా సరైన హిట్ లేక సతమతం అయిన ప్రభాస్ ఓకే ఒక్క సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి పార్ట్  భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేసింది. 2023లో భారీ విజయం సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే కలెక్షన్స్ లోనూ 600కోట్లకు పైగా వసూల్ చేసింది సలార్ సినిమా. ఇదిలా ఉంటే తాజాగా సలార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలన విజయం సాధించింది.

తాజాగా నైజం లో నయా రికార్డ్ క్రియేట్ చేసింది సలార్ సినిమా.. నైజం లో 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్ ను క్రియేట్ చేసింది సలార్. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఓ అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికి కూడా థియేటర్స్ దగ్గర సలార్ సినిమా హవా కొనసాగుతోంది. తాజాగా నైజం లో రికార్డ్ క్రియేట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.🎥🌟


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page