top of page

ప్రభాస్ అభిమానులకు ‘సాలార్’ టీమ్ బంఫర్ ఆఫర్. .

సలార్ టీజర్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని విధంగా కంప్లీట్ బీస్ట్ అవతార్‌లో ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే, ఈ లోపల ఈ టీజర్‌పై మరింత క్రేజ్‌ను తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా సలార్ ఫ్యాన్స్‌కి ఒక ఆఫర్ ఇచ్చింది.

యావత్తు భారత సినీ పరిశ్రమలో ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ సలార్ . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రమిది. ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచీ దీనిపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మేక‌ర్స్ స‌లార్ టీజ‌ర్‌ను జూలై 6 ఉద‌యం 5 గంట‌ల 12 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నట్లు ప్రక‌టించారు.ప్రస్తుతం సలార్ టీజర్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ క్రేజ్‌ను మరింత పెంచడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక ఆఫర్ ఇచ్చింది. వారి ప్రతిభకు పరీక్ష పెట్టింది. సలార్పై స్టన్నింగ్ డిజైన్లు, మతిపోగొట్టే వీడియో ఎడిట్‌లు చేసి టాలెంట్‌ను నిరూపించుకోవాలని సూచించింది. ఈ డిజైన్లు, వీడియో ఎడిట్ల ద్వారా మోస్ట్ వయోలెంట్ మేన్ గురించి మరింత ఎక్కువ మందికి తెలిసేలా చేయాలని చెప్పింది. ఈ కాంపిటీషన్‌లో సలార్ టీమ్‌ను మెప్పించగలిగే వారిని సలార్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా ప్రజలకు చూపిస్తామని పేర్కొంది. ఇంకేముంది.. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సలార్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది రంగంలోకి దిగుతున్నారు.కాగా, ఈ ఏడాది విడుద‌ల‌వుతున్న సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ మూవీ స‌లార్‌. ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకుల అంచ‌నాలకు ధీటుగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో అత్యంత క్రూరమైన వ్యక్తిగా ప్రభాస్ కనిపించబోతున్నారు. కె.జి.యఫ్ మాదిరిగానే డార్క్ థీమ్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్‌, శ్రుతీ హాస‌న్‌, జ‌గ‌ప‌తి బాబు ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page