top of page
Shiva YT

డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న Project K అప్ డేట్‌..

ప్రభాస్‌తో పాటు ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకోన్ నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియాకు మించి గ్లోబల్‌ మూవీ అన్న రేంజ్‌లో ఆ మూవీ మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేయకపోయినా...


ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో విజువల్ వండర్ ప్రాజెక్ట్ కే (Project K). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఎవ్వర్ మూవీగా నిలిచిపోవడం ఖాయమన్న టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ రేంజ్‌లో భారీ అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్‌తో పాటు ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకోన్ నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియాకు మించి గ్లోబల్‌ మూవీ అన్న రేంజ్‌లో ఆ మూవీ మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేయకపోయినా… ఈ సినిమా టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందన్న టాక్ అయితే ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌ను జెట్‌ స్పీడుతో ఫినిష్ చేసేస్తున్నారు మేకర్స్‌. ఆ సినిమా ప్రొడక్షన్‌ వర్క్‌ ఇప్పటికే 75 శాతానికి పైగా పూర్తయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ సంబంధించిన షూటింగ్‌ను దాదాపుగా ఫినిష్ చేసేశారట. పెండింగ్ వర్క్‌ను కూడా మరో మూడు, నాలుగు వారాల్లోనూ పూర్తి చేసేలా నాగ్ అశ్విన్ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారని తెలుస్తోంది.

సోషియో ఫాంటసీ కథ కావటంతో.. అందుకు తగ్గట్టుగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు మేకర్స్‌. ముఖ్యంగా సెట్స్, వెహికల్స్‌ లాంటి వాటిని యంగ్ ఇంజనీర్స్‌ను హైర్‌ చేసి మరి డిజైన్ చేయిస్తున్నారు. ప్రజెంట్ ఇదే వర్క్ జరుగుతోందని… ఈ సినిమా డార్లింగ్ ఫ్యాన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని హామీ ఇస్తున్నారు కెప్టెన్ నాగీ. ఆల్రెడీ ప్రమోషన్‌ స్టార్ట్ చేసి వరుసగా మేకింగ్ వీడియోలతో అప్‌డేట్స్ ఇస్తున్నారు.

రీ ఇన్వెంటింగ్‌ ద వీల్, అసెంబ్లింగ్‌ ది రైడర్స్ పేరుతో ఇప్పటికే రెండు మేకింగ్ వీడియోస్‌ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సినిమా మీద అంచనాలు భారీగా పెంచేశాయి. దీంతో ఆ రేంజ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అయ్యేలా కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్‌గా ఎమర్జ్ అవుతారంటున్నారు డైహార్డ్‌ ఫ్యాన్స్‌. అయితే ఈ మూవీకి సంబంధించిన మరో టాక్ కూడా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీని ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు 2024 జనవరిలో రిలీజ్ చేసే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది.

bottom of page