top of page

ప్రభాస్ కొత్త సినిమా పూజా కార్యక్రమంలో తళుక్కుమన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?


ప్రభాస్- హనురాఘవపూడి సినిమా పూజా కార్యక్రమంలో మెరిసిన ఈ బ్యూటీ పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఢిల్లీలో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది. అలాగే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇమాన్ డ్యాన్స్ లకు నెట్టింట భారీగా క్రేజ్ ఉంది. ఎన్నో స్టేజ్‌లపై డ్యాన్స్ షోలు చేసిన అనుభవం కూడా ఉంది. వీడియో ఆల్బమ్స్ తోనూ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఇమాన్ ను 686K అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇమాన్ ప్రభాస్ సినిమా పూజా కార్యక్రమానికి ఎందుకు వచ్చిందనేది మాత్రం అర్థం కావడం లేదు. ఒక వేళ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించేది ఈ అమ్మాయేనా? లేక వేరే రీజన్ తో ఇక్కడకు వచ్చిందా? అన్నది తెలియాలంటే హను రాఘవ పూడి చిత్ర బృందం ఎవరో ఒకరు స్పందించాల్సిందే.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page