top of page

ప్రభాస్ ‘స్పిరిట్‌’కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..🎥🎭

ప్రభాస్ ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి 'స్పిరిట్' అని టైటిల్ పెట్టారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి 'స్పిరిట్' అని టైటిల్ పెట్టారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రానికి కూడా ఈయనే మ్యూజిక్ చేశారు. ఈ చిత్రం పోలీస్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా హిందీలో రణబీర్‌కపూర్‌తో ‘యానిమల్‌’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ మూవీ పూర్తవ్వగానే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 🌟🎬


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page