top of page

ఈ బాయ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు..

ఇంతకు ముందు ఒకలెక్క.. ఇప్పుడు ఇంకో లెక్క.. యస్.. ఇంతవరకూ ఖాన్‌ల చుట్టూ తిరిగిన బాలీవుడ్‌ .. ఇప్పుడు ముంబైను దాటి.. హైదరాబాద్‌ వైపు చూస్తోంది.. కారణం.. వన్‌ అండ్ ఓన్లీ స్టార్. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాను పరిచయం చేయడంలో కీ రోల్ పోషించిన ఆ స్టార్ చిన్ననాటి ఫోటోనే ఇది. ఇంతకీ అతడెవరో మీరు గుర్తుపట్టగలరా..?





మీ ముందుకు ఓ ట్రెండింగ్, వైరల్ సెలబ్రిటీ పిక్‌ను తీసుకొచ్చాం. ఇతను పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఇంటర్నేషనల్ లెవల్‌లో పాపులర్ అయ్యాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం అతడి నైజం. అందరితో ప్రేమగా ఉండటం అతడికి పెద్దల నుంచి వచ్చిన లక్షణం. అర్జునుడి రూపాన్ని.. భీముడి బలాన్ని.. అభిమన్యుడి పౌరుషాన్ని.. రాముడు గుణాన్ని.. ఈ క్వాలిటీస్‌ అన్నింటిని మిక్స్‌ చేసి ఓ రూపం ఇస్తే.. అతడవుతాడు. ఆరడుగుల విగ్రహం, కండలు తిరిగిన దేహంతో స్క్రీన్‌ మీద ఈ హీరో కనిపిస్తే చాలు ఎవరికైనా మతి పోవాల్సిందే. లెక్కలేనంత ఫాలోయింగ్ ఉంది. అందగాడు.. యాక్షన్ చించేస్తాడు… అద్భుతమైన సినిమా అందిస్తే.. వేయి కోట్లు ఫస్ట్ వీకెండ్‌లో వసూలు చేయగలడు. అవెంజర్స్‌ సిరీస్‌ ఎఫెక్టో… యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రభావమో.. మనలో చాలామందికి హాలీవుడ్‌ హీరోల పేర్లు తెలుసు. మరి ఎంతమంది హాలీవుడ్‌ ఆడియెన్స్‌కు ఇండియన్‌ హీరోల పేర్లు తెలుసు. భారతీయ సినిమా అంటే బాలీవుడ్డే అని అడ్డంగా ఉన్న హిందీ బ్రిడ్జ్‌ను దాటి సౌత్‌ హీరోల పేర్లను పరిచయం చేసిన వ్యక్తి ఇతడు. ఇంత ఇంట్రో ఇచ్చినా కనిపెట్టకపోతే ఇక కష్టం అండీ. మేమే చెప్పేస్తున్నాం. హీ ఈజ్ నన్ అదర్‌దెన్ ప్రభాస్. గతంలో మన దగ్గర ఎంత టాప్‌ స్టారైనా సరే… వేరే రాష్ట్రానికి వెళ్లినప్పుడు మాత్రం నేను పలానా.. నా ట్రాక్‌ రికార్డ్‌ ఇది అని మొదట్నుంచి చెప్పుకొవాల్సిన పరిస్థితి ఉండేది. బాహుబలి తర్వాత ఆ సీన్‌ మార్చేశాడు ప్రభాస్‌. క్లియర్‌గా చెప్పాలంటే ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పుడు మరో లెక్క. సినిమాకు పెట్టే పేర్లు పవర్‌ఫుల్‌గా ఉండగానే సరిపోదు. అందులో కథానాయకుడిని చూడగానే టైటిల్‌ జస్టిఫికేషన్‌ చేస్తున్నట్టు ఉండాలి. హీరోకి పవర్‌ఫుల్ పర్సనాలిటీ ఉండాలి. ప్రభాస్‌ అచ్చం అలాంటి హీరోనే. ఆ కటౌట్‌కు ఏ టైటిల్‌ పెట్టినా బ్రహ్మాండమే. ఛత్రపతి అయినా.. బాహుబలి అయినా క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. పాదరసం లాంటి ప్రభాస్‌ ఏ రోల్‌కు కమిట్‌ అయితే ఆ రకంగా మేకోవర్‌ అయిపోతాడు. బాహుబలితో బాలీవుడ్‌కు.. మిగిలిన ప్రపంచానికి డార్లింగ్ దగ్గరయ్యాడు.ప్రభాస్‌ అనే పేరుకి ఇప్పడు ఇండియన్ మార్కెట్‌లో… అలాగే వరల్డ్‌ మార్కెట్‌లో ఎక్కడలేని గుర్తింపు. ఆ క్రేజ్‌ పాపులార్టీ చూస్తే ఓ తెలుగు హీరో అంటే ఇంత వెర్రా అనిపించడం సహజం. నిజమే ప్రభాస్‌ ఇప్పుడు సాధారణ తెలుగు హీరో కాదు.. పాన్‌ ఇండియా స్టార్‌. 100 కోట్ల వసూళ్లు సాధిస్తే గొప్పగా చెప్పుకునే టాలీవుడ్‌లో 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు వంటి మైలు రాళ్లను సునాయాసంగా దాటి చూపించిన హీరో. అలాగే ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు ప్రభాస్‌. ప్రస్తుతం ప్రభాస్‌ పేరుతో ఉన్నన్ని రికార్డ్స్‌ ఏ సౌతిండియా హీరోకు లేవన్నది మాత్రం అందరూ ఒప్పుకు తీరాల్సిన నిజం. త్వరలో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సలార్, ప్రాజెక్ట్‌ కే సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మారుతీ, సందీప్ రెడ్డి వంగా, సిద్దార్థ్ ఆనంద్‌లతో కూడా సినిమాలు కమిట్ అయ్యాడు

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page