top of page

ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా రెండు సినిమాలు రీ రిలీజ్..


అక్టోబర్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. అయితే అంతకుముందే ఆయన నటించిన సినిమాల రీ-రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలను ఎన్ని సార్లు వచ్చిన చూస్తారు ఫ్యాన్స్.. ఇక ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ సినిమా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 23న రీ-రిలీజ్ కానుంది. 2010లో విడుదలైన ‘డార్లింగ్’ కామెడీ-రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలోని కామెడీ, పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 23న మళ్లీ విడుదల కానుంది. ప్రభాస్ పుట్టినరోజు అంటే అక్టోబర్ 23న ప్రభాస్ నటించిన మొదటి సినిమా ‘ఈశ్వర్’ రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు 2002లో విడుదలైన ‘ఈశ్వర్’ సినిమాలో ప్రభాస్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించింది. ‘ఈశ్వర్’ సూపర్ హిట్ అయ్యింది అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’, హను రాఘవాపుడి దర్శకత్వంలో కొత్త చిత్రం, ‘కల్కి 2’ అలాగే ‘సలార్ 2’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page