top of page

ఉచిత విద్యుత్‌కు ముందే షాక్ .. ఇకపై హైదరాబాద్ వాసులకు కష్టాలు మొదలు

హైదరాబాద్ గ్రేటర్ వాసులకు బ్యాడ్ న్యూస్. నగరంలో ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ కోతలు లేకండా హాయిగా 24గంటల పాటు నిరంతర విద్యుత్ పొందుతున్న హైదరాబాదీలకు విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు.

హైదరాబాద్ గ్రేటర్ వాసులకు బ్యాడ్ న్యూస్. నగరంలో ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ కోతలు లేకండా హాయిగా 24గంటల పాటు నిరంతర విద్యుత్ పొందుతున్న హైదరాబాదీలకు విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. జనవరి 17వ తేది అనగా బుధవారం నుంచి విద్యుత్ కోతలు ఉంటాయని టీఎస్‌ఎస్‌పీడీసీెల్ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోజుకు 15 నుంచి రెండు గంటల వరకు పవర్ కట్ ఉంటుంది పేర్కొంది. హైదరాబాద్ లో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10వ తేది వరకు విద్యుత్ కోతలుంటాయని పేర్కొన్న టీఎస్ఎస్‌పీసీడీఎల్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. విద్యుత్ అంతరాయ కలిగే ప్రాంతాలకు సంబంధించిన వివరాలను తమ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసింది.

TSSPDCL GHMC పరిమితుల్లో రొటేషన్ ప్రాతిపదికన విద్యుత్ లైన్లు మరియు సబ్ స్టేషన్ల నిర్వహణతో పాటుగా మరమ్మతు పనులను చేపడుతున్నారు. అలాగే వేసవిలో అధిక డిమాండ్‌ను ఎదుర్కోవాలని యోచిస్తోంది. దానికి సంబంధించి ఈ విధంగా డిమాండ్ కు తగిన సప్లై ఇవ్వాలనే శీతాకాలంలో విద్యుత్ కోతలు అనివార్యమైనట్లుగా పేర్కొంది. జనవరి 17నుండి అంటే బుధవారం నుంచి వచ్చే నెల 10వ తేది వరకు రోజుకు 15 నిమిషాల నుండి 2 గంటల వరకు నిర్వహణ పనులను పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో విద్యుత్ కోతలకు మినహాయింపు ఇచ్చారు. మీ ఇంట్లో పాత ఫ్యాన్లు ఉంటే, వాటిని వెంటనే మార్చాలి. ఈ ఫ్యాన్లు 100 నుండి 140 వాట్స్ కాలుస్తుంది. అయితే ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంటే.. BLDS ఫ్యాన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ ఫ్యాన్లు 40 వాట్స్ వరకు ఉంటాయి మరియు విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

నిర్వహణ పనులు చేపట్టే ప్రాంతంలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని TSSPDCL కోరింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో నిత్యం విద్యుత్ కోతలుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతీకాత్మక చిత్రం

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page