top of page

ఇండియా లో పేదరికం తగ్గిందంట..తాజా నివేదికలు

గత 15 ఏళ్లలో భారీగా పేదరికం తగ్గినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా గత దశాబ్దంన్నర కాలంలో 41.5 కోట్ల మంది పేదరిక సంకెళ్ల నుంచి విముక్తి పొందినట్లు తెలిపింది.

బ్రిటీష్ వారు వదిలివెళ్లినప్పటి నుంచి వచ్చిన ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి, తీసుకుంటున్న నిర్ణయాలు.. దేశం పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి తోడ్పాటును అందించాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో గత 15 ఏళ్లలో ఎంతమంది భారత్‌లో పేదరిక సమస్యను అధిగమించారన్నది తెలిపింది. ఈ 15 ఏళ్ళలో 41.5 కోట్ల మంది తమ బతుకులను పేదరికం నుంచి బయట పడేసుకున్నారని తెలిపింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP), ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (OPHI) సంస్థలు కలిసి గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’(MPI) ను తాజాగా విడుదల చేశాయి. ఇందులో భారత్, చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం సహా 25 దేశాలు తమ పేదరికాన్ని సగం తగ్గించుకున్నాయని వెల్లడించాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన పేదరికం నిర్మూలన దిశగా తొందరగా పురోగతి సాధించగలమని ఈ గణాంకాలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Komentarze


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page