top of page
Suresh D

పిల్లలు మాట వినట్లేదని కొడుతున్నారా.. ఇలా చేసి చూడండి..

పిల్లల్ని సరిగ్గా పెంచడం చాలా ముఖ్యం. అదే విధంగా, వారు చెప్పిన మాట వినేలా కూడా చూడాలి. అందుకోసం కొట్టాల్సిన పనిలేదు. కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. విదేశాల్లో పిల్లల్ని కొట్టడం నేరం. కానీ, ఇండియాలో పిల్లల్ని సరిదిద్దేందుకు పేరెంట్స్ కొడతారు. భరించలేని కోపమొచ్చినప్పుడు ఓ చెంపదెబ్బ చాలు. అంతేకానీ, పదే పదే అదే పనిగా కొడుతుంటే అది వారి స్టడీస్, మెంటల్ కండీషన్, లైఫ్‌పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని వల్ల పెద్దయ్యాక పిల్లలు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. నిజానికీ పిల్లలు చేసే కొన్ని తప్పుల కారణంగా చాలా కోపం వస్తుంది. అలాంటప్పుడు కాస్తా ప్రశాంతంగా ఉండి ఊపిరి పీల్చుకోండి. పిల్లలతో మాట్లాడండి. వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుని అర్థమయ్యేలా చెప్పండి. అదే విధంగా పిల్లలని ఎంతసేపు గ్యాడ్జెట్స్‌కి అతుక్కుపోనివ్వకుండా కాసేపు ఆడుకోనివ్వండి. ఇది ఒక్కసారే జరుగదు. కానీ, నెమ్మదిగా వారిని దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడుతుంటే మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది. అదే విధంగా, పిల్లలపై అరవడం, తిట్టడం కూడా చేయొద్దు. దీని వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. పిల్లల్ని సరిగ్గా పెంచడంలో ఫెయిల్ అయ్యామంటూ కొంతమంది పేరెంట్స్ బాధపడతారు. దీని వల్ల నెగెటీవ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ, పిల్లలు మారరు. కాబట్టి, అలా కాకుండా వారికి మెల్లిగా అర్థమయ్యేలా చెప్పండి. పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా చీకటిగదిలో ఉంచొచ్చు. కానీ, దీని వల్ల పిల్లలపై ఎఫెక్ట్ పడుతుంది. నన్ను ఎవరు ఇష్టపడరు. నాకు ఎవరు అవసరం లేదని అనుకుంటారు. అలాంటివి చేయొద్దు. వారికి అర్థమయ్యేలా చెప్పండి చాలు. ఇది నిజానికీ కొట్టడం, తిట్టడం కంటే బెటర్ అనుకుంటారు.. వారు మాట వినకపోతే హాస్టల్‌కి పంపుతానని, ఇంజెక్షన్స్, డాక్టర్స్ అంటే భయపడేవారికి అక్కడికి తీసుకెళ్తానని అంటారు. కానీ, దీని వల్ల పిల్లలకి ఎందుకు ఇంత కఠినంగా ఉంటారు అని రిలేషన్స్ మీదే నమ్మకం పోతుంది. అలా చేయకుండా వారి ప్రవర్తన కారణంగా ఎంతగా విసిగిపోతున్నారో ఎలాంటి నష్టం జరుగుతుందో చెప్పండి. అదే విధంగా, చాలా మంది వేరే పిల్లలతో పోలుస్తుంటారు. దీని వల్ల వారిలో ఓ రకమైన తిరస్కరణ భావన వస్తుంది. అలా చేయొద్దు. దీంతో పిల్లలు నమ్మకం కోల్పోతారు. ఏం సాధించలేరు. పిల్లల్ని పోల్చడం మానేసి వారి బలహీనతలపై దృష్టిపెట్టండి.

bottom of page