top of page

ఓట్ లవర్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్..

గతంలో వచ్చిన పీఎస్ 1 చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కలిగించింది. ఇందులో విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, త్రిష, ఐశ్వర్య రాయ్ కీలకపాత్రలలో నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.


మణిరత్నం తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్ 2. గతంలో వచ్చిన పీఎస్ 1 చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కలిగించింది. ఇందులో విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, త్రిష, ఐశ్వర్య రాయ్ కీలకపాత్రలలో నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు మణిరత్నం. మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించగా, గత నెలలో రెండో భాగం విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. పార్ట్2లో కూడా కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు.

ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాను చూడాలంటే డబ్బులు పే చేయాల్సిందే. రెంటల్ పద్దతిలో ఈ సినిమాను అందుబాటులోకి వచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో.



Opmerkingen


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page