top of page

🎭 రామగుండం నేతలకు కేటీఆర్ క్లాస్..

🔍 ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కి వ్యతిరేకంగా రామగుండంలో ప్రత్యేక కూటమి ఏర్పడిందన్న లుకలుకల నేపథ్యంలో నేరుగా ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. నియోజకవర్గంలో అంతర్గత కలహాలపై ఆరా తీశారు.

సెగ్మెంట్లలో జరిగిన అంశాలను ఒక్కొక్కటిగా కేటీఆర్‌కు వివరించారు ఎమ్మెల్యే. తనతో ఉన్న వాళ్లే తనను ఇప్పుడు బదనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని అంటూ కేటీఆర్ ముందు తన గోడు వెళ్లబోతున్నారు చందర్.

🔮ఇది ముగియగానే అసమ్మతి నేతలతోనూ భేటీ అయ్యారు కేటీఆర్. రామగుండంలో అసలేం జరుగుతోందని ఆరా తీశారు. సర్వేలను బట్టి గెలుపు గుర్రానికే టిక్కెట్ ఇస్తామన్న కేటీఆర్.. పార్టీకి నష్టం కలిగించే పనులు చేయకూడదని సూచించారు. ఐదుగురు అసమ్మతి నేతలకు సర్వేలు అనుకూలంగా ఉంటే మీకు కూడా టిక్కెట్‌లు వస్తాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడినంత మాత్రాన ఆయన తనకు దగ్గర అనుకుంటే పొరపాటు అవుతుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తమపై ఎమ్మెల్యే కేసులు పెట్టి వేధించాడని ఐదుగురు ఆవేదన వ్యక్తం చేయగా.. ఆ విషయం తన దృష్టిలోకి రాలేదని కేటీఆర్ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌లో పెట్టి మాట్లాడకూడదంటూ అసమ్మతి నేతలకు కేటీఆర్ వివరించారు.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page