top of page
Shiva YT

మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

🏛️🌧️తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభం కానున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. 🗳️🗓️నవంబరు, డిసెంబర్‌లలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. 🤝🔄

విపక్షాల ఆరోపణలు, విమర్శలకు టీసర్కార్‌ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనేది ఆసక్తిగా మారింది. 🤔 వాస్తవానికి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తెలంగాణ కన్నా మహారాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టడంతో.. విపక్షాల విమర్శలపై ఇన్ని రోజులు రియాక్ట్‌ కాలేదు. 😶 చాలా సమస్యలకు ప్రభుత్వం నుంచి స్పందన కూడా రాలేదు. ఇప్పుడు.. వాటన్నింటికీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి ఉంది. 🗣️ ధరణి సమస్యలు, 24 గంటల ఉచిత వ్యవసాయ కరెంట్, టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఇష్యూ, డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, దళితబంధు అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందన్నది ఆసక్తి రేపుతోంది. 😲 అలాగే.. సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు అప్లికేషన్లు తీసుకోలేదు. 🏠💸 బీసీలకు లక్ష రూపాయల పథకం 14 కులాలకే పరిమితం చేసింది ప్రభుత్వం. ఆయా పథకాలపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 🧐 అటు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా విపక్షాలు అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. 💼💰

bottom of page