బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసేందుకు చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ చేయలేని పనిని బీజేపీ చేస్తోంది. ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇస్తోంది. దీనికోసం బీసీలందరూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. అలాగే సెంటిమెంట్‌ను రగిలించాలని భావిస్తున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 🏛️🤝
తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఆయుష్మాన్ భారత్ కింద రూ. 10 లక్షల దాకా ఉచిత వైద్యం 💉🏥
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి పేద వ్యక్తికి ఇల్లు 🏡
రైతులను ఆదుకునేందుకు వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,100 🌾💸
వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ. 20వేలు చెల్లింపు 🚜💰
నిరుద్యోగులకు యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు జాబ్ కేలెండర్ 📅📚
ప్రతి వ్యక్తికి జీవిత బీమా వర్తింపు 🏥💼
రైతులకే కాకుండా కౌలు రైతులు, అటో రిక్షాకార్మికులు, ఇతర పేదలకు ప్రమాదబీమా రూ. 5 లక్షలు చెల్లింపు
వివాహిత మహిళలకు ఏడాదికి రూ.12 వేల భృతి 💑💰
మహిళా సంఘాలు, రైతులకు వడ్డీలేని రుణాలు 🚺💪
వంట గ్యాస్ సిలిండర్ రూ.500 కే అందించేలా చర్యలు 🔥💰
ఇంట్లో వృద్ధులైన భార్యా, భర్తలు ఇద్దరికీ రెండు పెన్షన్లు 👵👴
ఐఐటీ, ఎయిమ్స్ తరహాలో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల ఏర్పాటు 🎓🏫