top of page

యూనిఫామ్‌లో సినిమా పాటలకు పోలీసుల డ్యాన్సులు..


నాగ్‌పూర్‌లోని తహసీల్ పోలీస్ స్టేషన్ నుండి ASI సంజయ్ పాటంకర్, హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖయ్యూమ్ గని, భాగ్యశ్రీ గిరి, కానిస్టేబుల్ నిర్మలా గావ్లీలను డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత అధికారులు ప్రముఖ బాలీవుడ్ పాట అయిన “ఖైకే పాన్ బనారస్వాలా” కి డ్యాన్స్ చేశారు. ఇదంతా సదరు పోలీసు సిబ్బంది వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు అధికారులు సమర్థించగా.. మరికొందరు దుయ్యబట్టారు. ఇలా ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో వీరిపై చర్యలు తీసుకున్నారు. డ్యాన్స్ చేసిన నలుగురిని సస్పెండ్ చేస్తూ.. జోన్-3 ఇన్‌ఛార్జ్ డీసీపీ రాహుల్ మద్నే ఆదేశించారు. యూనిఫామ్‌కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని.. పదే పదే డ్యాన్సులు చేస్తూ పోలీసుల పరువు తీయొద్దని వార్నింగ్ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఈ విషయం వైరల్‌గా మారింది.



Related Posts

See All

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page