top of page
Suresh D

'విశ్వనేత' గా ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్.. 🎬🇮🇳

అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంతో అసలు సిసలు యుగ పురుషుడిగా జాతి జనుల చేత కీర్తించబడుతున్నారు. 🕍 తాజాగా ఈయన జీవిత చరిత్రపై విశ్వనేతగా ఓ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.

గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి భారత దేశ ప్రధానిగా రెండు సార్లు దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టిన భారతీయు ప్రియతమ నేత నరేంద్ర మోదీ. 🇮🇳 వరుసగా రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ముచ్చటగా మూడోసారి భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం" అనే అభిప్రాయాలు ఇప్పటికే వస్తోన్న సర్వేలు చెబుతున్నాయి. 📊 ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. 'విశ్వనేత" పేరుతో అన్ని భారతీయ భారతీసయ భాషల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 'వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్' పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు జాతీయ అవార్డు గ్రహీత కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. 🎥 ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జి.ఎస్.టి, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సాహసోపేత సంచలనాల నిర్ణయాలతో కోట్లాది భారతీయుల గుండెల్లో ప్రధాన మంత్రి కొలువ దీరారు. 🔝 త్వరలో "యూనిఫామ్ సివిల్ కోడ్", వన్ నేషన్ వన్ ఎలక్షన్, మెజారిటీ ప్రజలపై మెడపై కత్తిలా వేలాడుతున్న అనేక దుష్ట చట్టాలను నిర్మూలించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు. 🔨 ముఖ్యంగా నరేంద్రుడి బయోపిక్ లో చాయ్ వాలా స్థాయి నుంచి "విశ్వనేత" గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది.

గతంలో నరేంద్ర మోదీ జీవితంపై 'పీఎం నరేంద్రమోదీ' బయోపిక్ తెరకెక్కనుంది. 2019 ఎలక్షన్ సందర్భంగా ఈ మూవీ విడుదలైంది. అందులో వివేక్ ఓబెరాయ్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో నటించారు. అటు నరేంద్ర మోదీ జీవితంపై ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందిన సంగతి తెలిసిందే కదా.

bottom of page