top of page

8న వరంగల్‌కి ప్రధాని మోదీ..షెడ్యూల్ ఇదీ!

తెలంగాణలో హైదరాబాద్ లాగానే వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కి ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ టూర్ షెడ్యూల్ తెలుసుకుందాం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జులై 8న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ వస్తున్నారు. కొన్ని శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఈ టూర్‌కి సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.

తెలంగాణలో గ్రాఫ్ పడిపోవడంతో.. దాన్ని తిరిగి పైకి లేపడానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అస్త్రంగా మలచుకోవడానికి రాష్ట్ర బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే ఈ టూర్‌ని అట్టహాసంగా చేసేందుకు ప్రిపేర్ అవుతోంది.రెండు రోజుల కిందట వెళ్లిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్... కాజీపేట వ్యాగన్ విభాగంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎందుకంటే కాజీపేట వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే దేశంలోనే పెద్దదైన వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకి కూడా శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రెడీ చేస్తున్న బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.ఈ షెడ్యూల్‌ని గమనిస్తే.. ఈ నెల 8న మోదీ.. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో వస్తారు. ఉదయం 9.45కి హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కి వస్తారు. 9.50కి హెలికాప్టర్‌లో వరంగల్‌కి బయలుదేరతారు. 10.35కి వరంగల్ చేరతారు. తర్వాత వరుస కార్యక్రమాలు ఉంటాయి.ఈమధ్య బీఆర్ఎస్‌ని బీజేపీ రిష్తేదార్ సమితి అని నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం కూడా ఉంది. మరి ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఏం మాట్లాడతారు? ప్రచారాలకు ఎలా తెర దించుతారు అనేది రాజకీయంగా హాట్ టాపిక్‌గా ఉంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page