top of page

🇿🇦 దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి తెలంగాణ కళాఖండాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ..

🌐 బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా దరమాఫోసాతో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చెందిన బిద్రి కళాఖండం ‘సురాహి’ని బహుమతిగా ఇచ్చారు.

ఇది 500 ఏళ్ల నాటి కళ. తొలుత బీదర్‌కు మాత్రమే పరిమితమైన బిడ్రి కళ.. హైదరాబాద్‌కు విస్తరించింది. బిద్రి వాస్ జింక్, రాగి, ఇతర నాన్ ఫెర్రస్ లోహాల మిశ్రమంతో తయారు చేస్తారు. కాస్టింగ్‌పై అందమైన నమూనాలను చెక్కుతారు. స్వచ్ఛమైన సిల్వర్ వైర్‌తో అల్లుతారు. ప్రత్యేక ఆకర్షణ లక్షణాలను కలిగి ఉన్న బీదర్ కోటలో లభించే ప్రత్యేక మట్టితో, లోహపు ద్రావణాలుు కలిపి చేస్తారు. బిద్రి పాత్రలపై అవసరమైన డిజైన్స్ రూపొందిస్తారు. ఇందుకోసం బంగారం, వెండి వాడుతారు. దీనికి నలుపు రంగు రావడానికి కూడా ప్రత్యేక విధానం ఉంటుంది. అందుకే ఈ బిద్రి కళాఖండాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది.

🌄 ఇక నాగా శాలువాలు.. నాగాలాండ్ రాష్ట్రంలో గిరిజనులచే శతాబ్దాలుగా నేసిన వస్త్ర కళకు ప్రతిరూపం. ఈ శాలువాలు శక్తివంతమైన రంగులు, క్లిష్టమైన డిజైన్‌లు, తర తరాల నుంచి వీటిని నేసే సంప్రదాయం ఈ శాలువాకు క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ శాలువాను కూడా ప్రధాని మోదీ సౌతాఫ్రికా ప్రథమ మహిళ త్షెపో మోట్సెపేకి బహుమతిగా అందజేశారు.


Comments


bottom of page