top of page

🚀 “జన్ భాగీదారి”తో జనంలోకి.. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు నరేంద్ర మోదీ ప్రయాణం..

🇮🇳 దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఆ రోజు ఓ ప్రత్యేకమైన రోజు. ఆ రోజు అంటే అక్టోబర్ 7వ తేదీతో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయ్యాయి. 22 ఏళ్ల క్రితం ఇదే తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని ప్రమాణ స్వీకారం చేశారు. 🎂

🏡 గుజరాత్‌లోని మెహసానా జిల్లా వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబరు 17న జన్మించిన మోదీ నేడు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 🏡🗓️ 22 సంవత్సరాల క్రితం.. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. 🚗🎉 సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మోదీ వయసు 51 ఏళ్లు. గుజరాత్‌లో వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి 12 ఏళ్లపాటు సీఎం పదవిలో కొనసాగారు. 🗳️🇮🇳 దీని తర్వాత 2014లో కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన మోదీ 2019లో కూడా అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించారు. 🇮🇳🌏 నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టి 9 ఏళ్లు దాటింది. కొన్నేళ్లుగా ప్రధాని మోదీ అనేక దేశాలను సందర్శించారు. 🌍🤝 ప్రపంచంలో భారత్‌ను ఆ స్థానానికి తీసుకొచ్చారు ప్రధాని మోదీ. భారత్‌తో స్నేహ సంబంధాలను ఏర్పరచుకునే దిశగా అన్ని దేశాలు ముందుకు సాగుతున్నాయి. 🤗📈 ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఇప్పుడు గుర్తింపు పొందింది. 📊🇮🇳


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page