top of page

శాంతి చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలం.. ప్రధాని మోదీ


ఓవైపు భీకర యుద్ధం నడుస్తోంది.. ఇంకోవైపు శాంతి సందేశాన్ని మోసుకెళ్లారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నా.. భారత ప్రధాని సాహసోపేతమైన పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చారిత్రక భేటీ జరిగింది. రెండు రోజులు పోలండ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ఉక్రెయిన్‌ చేరుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం అన్ని విధాలా సహాయం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మోదీ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జులైలో మోదీ జరిపిన చర్చల వివరాలను జెలెన్‌స్కీకి వివరించారన్నారు. జెలెన్‌స్కీతో భేటీలో ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ రంగం, ఫార్మాస్యూటికల్స్‌, వ్యవసాయం, విద్య అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని, ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించే ఎక్కువ మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రధాని మోదీ పంచుకున్నారు.. ఎక్స్ వేదికగా.. ప్రధాని మోదీ హైలెట్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.. ఈ వీడియోలో.. కీవ్ లో పర్యటన, చర్చలు తదితర దృశ్యాలను పంచుకున్నారు.




Related Posts

See All

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page