top of page
Suresh D

సీనియర్ నటి లీలావతి మరణం..ప్రధాని మోడీ సంతాపం..😢🎥

ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి(85) కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బెంగళూరులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.

ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి(85) కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బెంగళూరులో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ‘భక్త కుంబరా’, ‘రణధీర కంటిరావా’, ‘సత్యహరిశ్చంద్ర’, ‘గాలిగోపురా’ లాంటి కన్నడ చిత్రాల్లో మరపురాని పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. దాదాపు 600లకి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు. కన్నడ, తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆమెకు కుమారుడు వినోద్ రాజ్ ఉన్నారు. ఆయనతో కూడా పలు కన్నడ చిత్రాల్లో కలిసి నటించారు.. తెలుగులో ‘వాల్మీకి’, ‘మర్మయోగి’, ‘మరోమలుపు’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు లీలావతి. చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు గానూ ఆమెకు కర్ణాటక ప్రభుత్వం డా.రాజ్కుమార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది.

లీలావతి మృతితో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. లీలావతి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సంతాపం తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటీమణి అయిన లీలావతి మృతి తనను చాలా బాధించిందని తెలిపారు. తన వైవిధ్యమైన నటనతో వెండి తెరను ఏలిన లీలావతి మరణం తీరని లోటు ఓం శాంతి అంటూ.. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.🌹🎬

bottom of page