top of page

ఉక్రెయిన్‌ పర్యటనకు ప్రధాని మోదీ..


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (Indian foreign ministry) సోమవారం స్పందించింది. మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు (PM Modi to visit Ukraine) స్పష్టం చేసింది. అయితే, అందుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. మోదీ పర్యటన వివరాలను త్వరలోనే పంచుకుంటామని తెలిపింది. అయితే, ఈ నెలలోనే మోదీ కీవ్‌లో పర్యటించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై 2022, ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభించింది. మూడు వారాల్లో ఆ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించుకోవాలని పుతిన్‌ సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉక్రెయిన్‌కు నాటో దేశాల మద్దతుతో మూడు వారాలు అనుకున్న యుద్ధం కాస్తా రెండున్నర ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడో తెలియని అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి యుద్ధం మార్గం కాదని, చర్చలతోనే శాంతి నెలకొంటుందని రష్యా, ఉక్రెయిన్‌కు ప్రధాని మోదీ పలుమార్లు సూచించారు.

ఇక రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల కిందట ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. అంతకు ముందు భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన మోదీకి జెలెన్‌స్కీ ఫోన్‌ ద్వారా అభినందనలు తెలియజేశారు. ఓ సారి ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని కీవ్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. జూన్‌ 8న ప్రధాని మోదీ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇండియా-రష్యా 22వ వార్షిక సమావేశం సందర్భంగా ప్రధానిని రష్యాలో పర్యటించాలని పుతిన్‌ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు మోదీ మాస్కోలో రెండు రోజుల పాటు పర్యటించారు. పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మోదీకి ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని పుతిన్‌ అందజేశారు. తన పర్యటన సందర్భంగా పుతిన్‌తో మోదీ ఆలింగనం చేసుకున్నారు. దీనిపై జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోదీ ఉక్రెయిన్‌ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

Kommentarer


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page