top of page

🚩🔥 సనాతనంపై దాడితో బీజేపీకి ఆయుధమిచ్చిన విపక్షాలు.. 🤯

🕉️ సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల తర్వాత జరిగిన మొదటి కేంద్ర కేబినెట్ సమావేశంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంయమనంతో ఎదురుదాడి చేయాలంటూ సూచన చేశారు. 📜👥

తాజాగా గురువారం మధ్యప్రదేశ్‌లోని బినాలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ స్వయంగా విపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. 💪🗣️ సనాతన సంస్కృతిని అంతం చేయడానికి I.N.D.I కూటమి ఒక తీర్మానంతో ముందుకొచ్చిందని ఆయన నొక్కి చెప్పారు. ✊🧐 ఇప్పుడు సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, ఈ దాడిని ఇకపై మరింత ముమ్మరం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. 🤔📢 సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ, ఆచరించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ✨🙏 మన దేశాన్ని బానిసత్వం వైపు నడిపించాలనే స్పష్టమైన ఉద్దేశం ఈ శక్తులకు ఉందని, సమిష్టిగా వారి పథకాలను తిప్పికొట్టాలని ఆయన నొక్కి చెప్పారు. 🌍🤝 అహంకారంతో కూడిన ఈ కూటమికి విధానం అంటూ ఏదీ లేదని, నాయకుడు కూడా లేడని.. సనాతన ధర్మం అంశంలో కూటమిపై ఎదురుదాడి చేస్తున్న సమయంలో.. ప్రధాని తన ప్రసంగంలో మహాత్మా గాంధీ, అహల్యాబాయి హోల్కర్, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్‌లను ప్రస్తావించారు. 🙌🌞

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page