top of page
Shiva YT

🎤 నేను పాట పాడుతూ కనిపించాను.. డీప్ ఫేక్ వీడియోలతో వ్యవస్థకు పెను ముప్పు..

“👁️ఇటీవల నేను పాడే వీడియో చూశాను. నాకు నచ్చిన వారు ఫార్వార్డ్ చేసారు. అందులో నేను పాట పాడుతున్నట్టుగా చూపించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇది సమస్యాత్మకమైన అంశం. డీప్ ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా వీడియోలపై మీడియా, పాత్రికేయులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజలను సన్నద్ధం చేయాలి” 👤 అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతేకాదు, వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలను గుర్తించి, వాటిని ఫ్లాగ్ చేసి హెచ్చరికలు జారీ చేయాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్టు ప్రధాని మోదీ తెలిపారు. 👥 ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముందుగా రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా రేపింది. బ్లాక్ యోగా బాడీసూట్ ధరించిన అమ్మాయి.. ముఖం రష్మికగా మార్ఫింగ్ చేశారు. ఆమె నవ్వుతూ ఎలివేటర్‌లోకి ప్రవేశిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఆ తర్వాత కత్రినా కైఫ్ ‘టైగర్ 3’లో టవల్ ఫైట్ సన్నివేశానికి సంబంధించిన మార్ఫింగ్ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కాజోల్‌కి సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. నటి బట్టలు మార్చుకుంటున్నట్లు దీనిలో చూపించారు. ఈ క్లిప్‌లో, కాజోల్ ముఖాన్ని ఇంగ్లీష్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రోసీ బ్రీన్ వీడియోతో మార్ఫింగ్ చేశారు. ఇలా డీప్ ఫేక్ వీడియోలు అంతటా దుమారం రేపుతున్నాయి.

bottom of page