top of page
Shiva YT

"పేటెంట్ దరఖాస్తుల పెరుగుదలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..📈

2022లో భారతదేశంలోని నివాసితుల పేటెంట్ దరఖాస్తులు 31.6 శాతం పెరిగాయని, టాప్-10 ఫైలర్‌లలో మరే ఇతర దేశంతో పోల్చలేని 11 సంవత్సరాల వృద్ధి సాధించిందని ఆ నివేదిక పేర్కొంది. 🌐

మరోవైపు 2022లో అత్యధికంగా పేటెంట్ ఫైలింగ్‌లు చేసిన దేశాల్లో చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ ఉన్నాయని తేల్చింది. 🚀 మరోవైపు చైనాకు చెందిన అవిష్కర్తలు దాదాపుగా సగానికిపైగా గ్లోబల్ పేటెంట్ అప్లికేషన్‌లను దాఖలు చేశారు. 📄 అటు దేశం వృద్ధి రేటు వరుసగా రెండవ సంవత్సరం భారీగా పడిపోయింది. 2021లో వృద్ది రేటు 6.8 శాతం ఉండగా.. 2022లో 3.1 శాతానికి పడింది. 📉 ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘భారతదేశంలో పేటెంట్ దరఖాస్తుల పెరుగుదల.. మన యువతలో సరికొత్త ఆవిష్కరణలపై పెరుగుతున్న ఆసక్తిని కనబరుస్తోంది. ఇది రాబోయే కాలానికి చాలా సానుకూల సంకేతం’ 🌱 అని పేర్కొన్నారు. 🌞"

bottom of page