top of page

🗳️ నవంబర్ 7న తెలంగాణకు ప్రధాని మోదీ.. 🇮🇳

🏛️ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 🏃💨

నవంబర్ ఏడో తేదీన హైదరాబాద్ లో జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. 🎙️👤 సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. 📋📢

📅 నవంబర్ ఏడో తేదీన రాష్ట్రానికి రానున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 🛫🏙️ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో ఆయన పాల్గొంటారు. 🏟️🚀 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ✈️🏢 అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు. 🚗👋 సభ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. 🚆🏡

🤝 ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాన మంత్రి బీసీ గర్జన బహిరంగ సభ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. 👁️👥 ఈ సభను భారీగా నిర్వహించడానికి బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 🙌👍 లక్ష మందిని సభకు తరలించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. 📋🔊 సభ ఏర్పాట్లను ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 🧐🧐 బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ…తెలంగాణలో బీసీ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. 📢📈

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page