top of page

🌡️ జీ20 ఫీవర్ తగ్గింది. ఇప్పుడు పీ20 ఫీవర్ మొదలైంది.

📅 అక్టోబర్ 13న పీ-20 సమావేశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పేరుకు పీ-20 అని ఉన్నప్పటికీ ఇందులో 30 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

G-20లోని 20 సభ్య దేశాలతో పాటు, 10 ఇతర దేశాలు (ప్రత్యేక ఆహ్వానిత దేశాలు), అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు P20 సమ్మిట్‌లో పాల్గొంటారు. తొలిసారిగా భారత్‌లో జరుగుతున్న ఈ పీ-20 కార్యక్రమంలో ఆఫ్రికన్ పార్లమెంట్ అధ్యక్షుడు కూడా పాల్గొననున్నారు. 🌍 రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి మరో కొత్త అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమైంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ద్వారకలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌ను ‘యశోభూమి’ పేరుతో ఈ మధ్యనే ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఆ ‘యశోభూమి’ పీ20 సదస్సుకు వేదికగా మారింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ‘యశోభూమి’ని సందర్శించి, సన్నాహాలను సమీక్షించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన P-20 శిఖరాగ్ర సమావేశాల్లో ఇది తొమ్మిదవది.

P20 కాన్ఫరెన్స్ థీమ్ కూడా జీ20 థీమ్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇందులో స్వల్ప తేడా ఉంది. 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు కోసం పార్లమెంటు' అన్న థీమ్‌తో పీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. 🏛️ భారత పార్లమెంటులోని లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన సమాచారం ప్రకారం, 26 దేశాల చట్టసభల స్పీకర్‌లు, 10 మంది డిప్యూటీ స్పీకర్‌లు, 01 కమిటీ చైర్మన్‌తో పాటు 50 మంది పార్లమెంటు సభ్యులు, మరో 14 మంది ప్రధాన కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. 🌐

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page