top of page
Shiva YT

🌐 మోదీ క్రేజ్ ఏమాత్రం తగ్గేదేలే.. అత్యంత ప్రజాదరణ నేతగా మరోసారి అగ్రస్థానంలో నిలిచిన భారత ప్రధాని..🇮🇳

🌍 ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో దూసుకెళ్తున్నారు. ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్.. భారత ప్రధానమంత్రికి నానాటికి పెరుగుతుండటం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. తాజాగా.. 78.5% ఆమోదం రేటింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారని మార్నింగ్ కన్సల్ట్ సర్వే తెలిపింది. 📊


 ఈ డేటా ఆధారంగా.. మార్నింగ్ కన్సల్ట్ ప్రధాని మోదీ మరోసారి ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా టాప్ ర్యాంకింగ్ లో నిలిచినట్లు వెల్లడించింది. 🥇 ఈ రేటింగ్‌లు ప్రతి సర్వే చేయబడిన దేశంలోని పెద్దలలో.. ఏడు రోజుల సగటు అభిప్రాయాలను సూచిస్తాయని.. మార్నింగ్ కన్సల్ట్ తన నివేదికలో పేర్కొంది. 📢 ప్రాతినిధ్య నమూనాలకు పరమితులుంటాయని.. లక్ష్య జనాభా తదనుగుణంగా మారుతూ ఉంటుందని తెలిపింది. ఈ పద్దతి విధానం వివిధ జనాభా, భౌగోళిక పరిస్థితులను అంచనా వేసి అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తుల వివరాలను వెల్లడిస్తుంది. 📈

🌐 ఇదిలా ఉంటే, మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 64%తో రెండవ స్థానంలో ఉన్నారు. 🇲🇽 స్విట్జర్లాండ్‌కు చెందిన అలైన్ బెర్సెట్ 57% ఆమోదం రేటింగ్‌తో మూడవ స్థానంలో ఉన్నారు. 🇨🇭 పోలాండ్‌కు చెందిన డొనాల్డ్ టస్క్ 50% రేటింగ్‌తో నాల్గవ స్థానంలో ఉండగా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా 47% రేటింగ్‌తో ఐదోస్థానంలో.. 🇧🇷 ఆస్ట్రేలియన్ ప్రీమియర్ ఆంథోనీ అల్బనీస్ 45 శాతం ఆమోదం రేటింగ్‌తో ఆరోస్థానంలో నిలిచారు. 🇦🇺 ఏడో స్థానంలో ఇటలీ జార్జియా మెలోని, ఎనిమిదో స్థానంలో స్పెయిన్ కు చెందిన పెడ్రో, 9వస్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, 10వ స్థానంలో కెనడా జస్టిన్ ట్రూడో, 12వస్థానంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ నిలిచారు. 🌏📊🌏ఈ క్రమంలో దౌత్యవేత్త వ్యాపార సలహాదారుడు ఎరిక్ సోల్హిమ్ కీలక ట్వీట్ చేశారు. పాశ్చాత్య నాయకులు ఎంత అసూయతో ఉన్నారు? ప్రధాని మోడీకి నమ్మశక్యం కాని 77% ఆమోదం రేటుతో, పాశ్చాత్య మీడియా భారతదేశానికి మోడీజీకి కొంత సానుకూల కవరేజీని అందించే సమయం వచ్చిందా? అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో రాశారు.🌐


bottom of page