top of page

🇮🇳 ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రధాని మోదీ యాక్షన్ ప్లాన్.. 📜

📚 పేద, మధ్య తరగతి వర్గాలకు సొంతిల్లు అనేది చిరకాల స్వప్నం.. ఆ కలను నెరవేర్చుకునేందుకు దశాబ్దాలుగా కష్టపడుతుంటారు. 😓

అయినా.. సమస్యలు, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.. 💼 చివరకు సొంత ఇంటి కల.. కలలాగే మిగిలిపోతుంది. 🏡 ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాలకు సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 📜 ఈ మేరకు ఎర్రకోట వేదికగా జరిగిన 2023 స్వాతంత్ర్య దినోత్సవ (77వ స్వాతంత్ర్య దినోత్సవం) వేడుకల్లో నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. 🇮🇳 నగరాల్లో సొంత ఇంటి కలలు కంటున్న వారికి బ్యాంకు రుణాల్లో ఉపశమనం కలిగించే పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. 💰 సొంత ఇల్లు లేని నగరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబాల కోసం తమ ప్రభుత్వం త్వరలో ఈ పథకాన్ని తీసుకురానుందంటూ వివరించారు. 🏠 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన తన చివరి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను నేరవేర్చేందుకు.. 📢 అభివృద్ధిని కొనసాగించేందుకు మళ్లీ అధికారంలోకి వచ్చి.. 🌱 వచ్చే ఏడాది ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తానంటూ ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. 🌏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page