top of page
Shiva YT

ఈ దిశలో ఇంట్లో చెక్కిన ఫర్నిచర్ ఉంచడం శుభప్రదం.. 🪑✨

ఇంటి తలుపుల నుండి కిటికీల వరకు అనేక వస్తువులను చెక్కతో తయారు చేస్తారు. కొన్ని ఇళ్లలో సోఫాలు, మంచాలు, బల్లలు, కుర్చీలు కూడా చెక్కతో తయారు చేసినవి అందంగా కొలువుదీరతాయి. ఇంకా చెప్పాలంటే.. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం ఒక చెక్క వస్తువు అయినా ఉంటుంది.

గృహావసరాలకు ఉపయోగించే చెక్క ఫర్నిచర్ కు వాస్తుశాస్త్రంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వస్తువులను ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం చెక్క వస్తువులను ఏ దిక్కున ఉంచడం సరైనదో ఈ రోజు తెలుసుకుందాం! 🏠🪑📚

వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిశలో చెక్క ఫర్నిచర్ ఉంచడం ప్రయోజనకరం. చెక్క ఫర్నిచర్ ఉంచడానికి ఆగ్నేయ మూలను అంటే ఆగ్నేయ దిశను ఎంచుకోవడం మంచిది. ఈ దిశలో చెక్క ఫర్నిచర్ ఉంచడం మీ కుటుంబ సభ్యుల ఆర్ధిక అభివృద్ధి బాగుటుంది. అంతేకాదు వ్యాపారాభివృద్ధి కూడా పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్ద వారికి చాలా లాభం చేకూరుతుంది. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటారు. 💰🌱🛋️

ఏదైనా వ్యాపారం చేస్తే.. లాభాలను ఆర్జిస్తారు. ఈ దిశలో గ్రీన్ కలర్ చెక్క ఫర్నిచర్ లేదా ఫర్నిచర్ మీద ఏదైనా ఆకుపచ్చ రంగు కవర్స్ ను వేయాలి. ఇలా చేయడం వలన మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ఆగ్నేయ మూలలో కాకుండా.. తేలిక పాటి ఫర్నిచర్ అయితే తూర్పు దిక్కున కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 🌿🌈🏡

bottom of page