top of page

🔴🏰💬🔄📰 గులాబీ బాస్‌ వ్యూహమేంటో అర్థం కాక విపక్షాల విలవిల..

🔍🔵 ఉచిత కరెంటు తో కాంగ్రెస్ పై ఊపందుకున్న బీఆర్‌ఎస్‌ దండయాత్ర రకరకాలుగా కొనసాగుతూనే ఉంది. టార్గెట్ కాంగ్రెస్ గా గులాబీ బాస్ కేసీఆర్ తన వ్యూహాలకు రోజుకో రూపం ఇస్తున్నారు. ఇప్పటికే ఉచిత కరెంటు విషయం లో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ధర్నాలు, రైతు సమ్మేళనాలు కాంగ్రెస్ వ్యతిరేక తీర్మానాలు చేస్తోంది బీఆర్‌ఎస్‌.

ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా పార్టీలోని బీసీ నాయకులను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీల పట్ల వ్యవహరిస్తున్న తీరు వాడుతున్న భాష బాగాలేదు అవమానంగా ఉంది. అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లను ఏకం చేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకుల తీరును ప్రజల్లోకి తీసుకెళతాం అని పిలుపునివ్వడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పుడు బిసి నాయకులు కూడా రేవంత్ రెడ్డి బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటూ అటాక్ చెయ్యడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది అని చర్చ మొదలయింది. 💼🚩👥🗣️

댓글


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page