తమిళ సింగర్ సుచిత్ర తన మాజీ భర్త నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుచిత్ర తన మాజీ భర్త కార్తీక్ కుమార్‌తో పాటు హీరో ధనుష్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌లు గేలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా నటుడు ధనుష్, కార్తీక్ కలిసి అర్థరాత్రి మగవాళ్లతో పార్టీలు చేసుకుంటారని తెలిపింది.
అయితే ఈ వ్యాఖ్యల పట్ల సుచిత్రపై కార్తీక్ పరువు నష్టం కేసు వేశాడు. తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు రూ.కోటీ పరిహారం చెల్లించాలని కోరుతూ తన న్యాయవాది ద్వారా ఆమెకు నోటీసులు పంపాడు. అయితే ఈ కేసును విచారించిన కోర్టు.. కార్తీక్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సుచిత్రపై మధ్యంతర నిషేధం విధించింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉండగా.. తాజాగా తాను చేసిన వ్యాఖ్యల పట్ల తన మాజీ భర్తకు క్షమాపణలు చెప్పింది సింగర్ సుచిత్ర. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియోలో తన మాజీ భర్త కార్తీక్ కుమార్‌ను గే అని పిలిచినందుకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నాను. చెన్నై పట్టినబాకం పోలీస్ స్టేషన్ నుంచి వరుసగా వస్తున్న కాల్స్ వలన ఈ వీడియో పెడుతున్నాను. ఈ పోలీస్ స్టేషన్‌లో నాపై నా మాజీ భర్త కేసు పెట్టాడని వాళ్లు కాల్స్ చేస్తున్నారు. కార్తీక్‌ను గే అని పిలిచినందుకు తనకు క్షమాపణలు చెప్పాలని అలాగే ఈమెయిల్ లో కూడా అపాలజీ లెటర్ పంపించాలని పిటిషన్‌లో తెలిపినట్లు పోలీసులు చెప్పారని సుచిత్ర తెలిపింది.
ఈ వివాదాన్ని ఇంకా కోనసాగించాలి అనుకోట్లేదు. అందుకే కార్తీక్‌కు క్షమాపణలు చెబుతున్న. కార్తీక్ కుమార్‌ని గే అని పిలిచి అతని కెరీర్‌ను నాశనం చేశాను. అతని కెరీర్‌ను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. నిజానికి కార్తీక్ కుమార్ ఒక మగాడు. ఈ క్షమాపణల వలన మీకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను అంటూ సైటైరికల్‌గా చెప్పుకోచ్చింది. అయితే ఆ వీడియోను పెట్టిన రెండు గంటల్లోపే డిలిట్ చేసింది సుచిత్ర.