మెగా కోడలి మొదటి దీపావళి పండుగ కావడంతో నూతన జంట వారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు దీంతో ఈ అందమైన జంటను చూసి మురిసిపోతున్నారు మెగా ఫాన్స్…
వీరి వివాహం ఇటలీ లో నవంబర్ 1 వ తేదీన ఎంతో ఘనంగా జరిగింది. వరుణ్ లావణ్యలకు పెళ్లి తరువాత మొదటి పండుగ కావడం తో చాలా గ్రాండ్ గా దీపావళి వేడుకలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పండుగ దుస్తులతో వరుణ్ లావణ్య చూడముచ్చటగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరి ఫాన్స్. 🌟💍
జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేయడు. ఏదైనా సందర్భం ఉంటేనే పండగలకు ఫోటోలను షేర్ చేస్తాడు. తాజాగా దీపావళి వేడుకల్లో భాగంగా తన కుటుంబ సభ్యులతో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అతని భార్య లక్ష్మీ ప్రణతి సైతం కూడా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. కానీ వీరు సందర్భాన్ని బట్టి ఫోటోలు షేర్ చేస్తే ఆ ఫోటోలు మాత్రం తెగ ట్రెండింగ్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఈ ఫ్యామిలీ ఫోటోలో ఒక వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతులకు ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్. ప్రస్తుతం ఈ ఫోటోలో అభిమానులు చూపంత భార్గవ్ రామ్ పైనే ఉన్నాయి. పెద్ద కుమారుడైన అభయ్ రామ్ చాలా సైలెంట్ గా ఉంటాడు. కానీ భార్గవ్ మాత్రం విపరీతంగా అల్లరి చేస్తాడు అని కొన్ని ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా భార్గవ్ రామ్ లానే ఉండేవాడట.. దీంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు పండగ పోస్టర్ అంటే ఇది.. అని కామెంట్ చేస్తున్నారు. 📸💖