top of page
Suresh D

నగ్నంగా మహిళను ఊరేగించిన ఫోటోకు అవార్డు..

ప్రస్తుతం హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. గాజాలో అణువణువూ వెతుకుతూ హమాస్ కమాండర్లను వెంటపడి మరీ హతమార్చుతున్నారు. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు మొదట్లో చేసిన దాడులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిచ్చారు. దీంతో వాటికి ప్రతీకారంగా హమాస్ అంతానికి ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు.. పౌరులను చిత్రహింసలు పెట్టిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో ఓ మహిళను కిడ్నాప్ చేసి నడిరోడ్లపై నగ్నంగా ఊరేగిస్తూ గాజా స్ట్రిప్‌కు తీసుకెళ్లింది. తాజాగా ఆ ఫోటోకు తాజాగా ఫోటో ఆఫ్‌ ది ఇయర్‌గా నిలవడం తీవ్ర దుమారానికి కారణం అయింది. హమాస్‌ అకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ చిత్రానికి ఉత్తమ ఫొటో అవార్డు దక్కడం తీవ్ర వివాదానికి కారణం అయింది. ఇటీవల అమెరికాకు చెందిన డొనాల్డ్‌ డబ్ల్యూ.రెనాల్డ్స్‌ జర్నలిజం ఇన్‌స్టిట్యూట్‌.. వివిధ కేటగిరీల్లో పిక్చర్స్‌ ఆఫ్‌ ఇయర్‌ ఇంటర్నేషనల్‌ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఓ ఫొటోకు గాను అసోసియేటెడ్‌ ప్రెస్‌కు మొదటి బహుమతి లభించింది. షానీ లౌక్‌ను హమాస్‌ మిలిటెంట్లు నగ్నంగా ఊరేగించిన ఫోటోకు ఈ అవార్డు రావడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెట్టింట భారీగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన ఫోటోను ఉత్తమ ఫొటోగా ఎంపిక చేయడం ఏంటని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోను అవార్డు ఆర్గనైజర్లు తొలుత బ్లర్‌ చేయకుండానే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ తర్వాత దాన్ని తొలగించారు.

bottom of page