top of page

🏛️👥 ఏపీ హైకోర్టు ముందుకు నేడు చంద్రబాబు, లోకేష్‌ పిటిషన్లు...

🏙️🚗 అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్ కేసులో చంద్రబాబును ఏ1గా, మాజీ మంత్రి నారాయణను ఏ2గా చేర్చింది సీఐడీ. ఇదే కేసులో నారా లోకేష్‌ను ఏ14గా చేర్చుతూ మెమో దాఖలు చేసింది. అయితే, ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్‌ పొందగా… చంద్రబాబు, లోకేష్‌లు ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.

🏛️👨‍⚖️ మరోవైపు స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు 20 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రెండు వారాలుగా ఢిల్లీలోనే నారా లోకేష్ ఉండగా.. 20 రోజులుగా రాజమండ్రి టిడిపి క్యాంప్ శిబిరంలోనే బస చేస్తున్నారు భువనేశ్వరి, బ్రాహ్మణి. రోజుకి నాలుగు సార్లు ఇంటి భోజనం, బ్లాక్ కాఫీ, వేడి నీళ్లు, స్నాక్స్ చంద్రబాబుకు తీసుకెళుతున్నారు ఆయన వ్యక్తిగత సిబ్బంది. ఇవాళ చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పార్టీలోని సీనియర్ నాయకుల సలహా మేరకు ఇవాళ మళ్లీ తిరిగి మొదలుపెట్టాలనుకున్న యువగళం పాదయాత్రను వాయిదా వేసుకున్నారు నారా లోకేష్.

🏛️👨‍⚖️ అటు ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడడం.. సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో మరికొద్ది రోజులు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇవాళ కుటుంబ సభ్యులు ములాఖత్‌లో చంద్రబాబును కలవాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. 🇮🇳

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page