top of page

పెదకాపు 1' - మూవీ రివ్యూ

ఈ మధ్య కాలంలో టైటిల్ తోనే ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచిన సినిమాగా 'పెదకాపు 1' కనిపిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి వదులుతూ వస్తున్న పోస్టర్స్ తో మరింతగా అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. 'అఖండ' సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాత కావడం కూడా అందరిలో ఆసక్తి పెరగడానికి కారణమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో విరాట్ కర్ణ - ప్రగతి హీరో .. హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఈ రోజున థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.

సహజత్వంతో కూడిన యాక్షన్ సినిమాలు తమిళ పరిశ్రమ నుంచి ఎక్కువ వస్తాయని, తెలుగులో అటువంటి సినిమాలు తీయరని కొన్నాళ్ళ క్రితం వరకు విమర్శ వినిపించేది. 'రంగస్థలం', 'పలాస' వంటి చిత్రాలు అటువంటి విమర్శలకు చెక్ పెట్టాయి. శ్రీకాంత్ అడ్డాల 'నారప్ప' తీసినా... తమిళ సినిమా రీమేక్ అది. 'పెదకాపు 1' సినిమాతో తన మార్క్ మాస్ చూపించే ప్రయత్నం చేశారాయన.

గోదావరి లంక గ్రామాల నేపథ్యంలో నెత్తుటి రాజకీయాలతో కూడిన కథను తనదైన శైలిలో మాసీగా తీశారు. ఆయన రాత, తీతలో నిజాయతీ ఉంది. కొత్తగా ట్రై చేశారు. ప్రజల కోసం నిలబడే వాడిని పెదకాపు అంటరాని ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. మరి, హీరోని ముందు నుంచి 'పెదకాపు' అని ఎందుకు పిలుస్తున్నారు? యుక్త వయసులో ఆయన ఏం చేశారు? ఎందుకు పిలుస్తున్నారు? వంటివి చూపిస్తే కథ మరింత బలంగా ఉండేది. రైటింగ్, క్యారెక్టర్ ఎస్టాబిష్ చేయడంలో కొన్ని లోపాలు ఉన్నాయి. కథ కూడా కొత్తగా కనిపించదు. తెలుగుదేశం ప్రస్తావన పక్కన పెడితే... కథలో 'నారప్ప' ఛాయలు ఉన్నాయి. ఆ సినిమాలో తండ్రిని హీరోగా చూపిస్తే... ఈ కథలో కొడుకును హీరో చేశారు. మధ్య మధ్యలో 'రంగస్థలం' కూడా గుర్తుకు వస్తుంది.

సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. అయితే, గోదావరి లంక గ్రామాల్లో కులాల కుంపట్లను పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేదు. రాజకీయ గొడవలును సైతం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అధికార పోరులో అణగారి వర్గాలకు అన్యాయం జరగడంతో, వారిలో ఓ యువకుడు ధైర్యంగా పైకి వచ్చినట్లు చూపించారు. ఈ కథలో లవ్ ట్రాక్ అంతగా ఇమడలేదు. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అయినట్లు క్యారెక్టర్లు ఎక్కువ కావడంతో కాస్త కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కొన్ని పాత్రలకు ఇచ్చిన హైప్, ఆ తర్వాత కంటిన్యూ కాలేదు.

ఒక్క విషయంలో శ్రీకాంత్ అడ్డాలను మెచ్చుకోవాలి. టెక్నికల్ టీంతో ఫెంటాస్టిక్ వర్క్ తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ పరంగా ఛోటా కె నాయుడు హై స్టాండర్డ్స్ మైంటైన్ చేశారు. ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం కూడా ఎక్సట్రాడినరీగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ హైలైట్. సినిమా టేబుల్ మీద ఉన్నప్పుడు లెంగ్త్ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కథనం నిదానంగా సాగింది.

సినిమాలో మాస్ సన్నివేశాలను కొన్నిటిని తీసిన విధానం షాక్ చేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ మామూలుగా లేదు. ఇంటిలో శ్రీకాంత్ అడ్డాల, అనసూయ మధ్య సీన్ & క్లైమాక్స్ సైతం అంతే! తలలు తెగి పడ్డాయ్, రక్తం ఏరులై పారింది. సినిమాలో కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. కానీ, అవి స్టార్టింగ్ టు ఎండింగ్ కంటిన్యూ కాలేదు. సినిమాలో పెద్ద సమస్య అదే! కథ పరంగా వావ్ ఫ్యాక్టర్ ఏదీ లేదు. పైగా నిదానంగా సాగింది. పతాక సన్నివేశాల్లో, మధ్యలో ఎన్టీ రామారావు & తెలుగుదేశం పార్టీ అభిమానులకు నచ్చే సన్నివేశాలు ఉన్నాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page