top of page

తెలుగు టాప్ 9 లేటెస్ట్ న్యూస్..

హైదరాబాద్‌ ప్రాజెక్టులపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రీజనల్‌రింగ్‌రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్‌ నిర్మించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం తర్వలోనే సర్వే మొదలు పెట్టనున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. రైల్వే ప్రాజెక్టు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని,


హైదరాబాద్‌ ప్రాజెక్టులపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రీజనల్‌రింగ్‌రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్‌ నిర్మించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం తర్వలోనే సర్వే మొదలు పెట్టనున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. రైల్వే ప్రాజెక్టు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, సర్వే కోసం 14 కోట్ల రూపాయలు రైల్వే శాఖ కేటాయించిందని చెప్పారు. రూట్‌ మ్యాప్‌ 99 శాతం కొలిక్కి వచ్చిందన్న ఆయన భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. బక్రీద్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బక్రీద్‌ సందర్భంగా జంతువధపై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిజమైన స్ఫూర్తితో బక్రీద్‌ జరుపుకోవాలని ఆదేశించింది. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. గోవధ నిషేధం చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు2న నివేదికలు సమర్పించాలని కోరింది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page